Tuesday, 17 May 2011

Tanthadi Beach 15th march 2008

"తంతడి"అనే ఊరును ఆనుకొని ఉన్న బీచ్ గనుక "తంతడి బీచ్" గా ప్రసిద్ది. 2008 మార్చి 15 వ తేదీన  ఈ బీచ్ కు మొదటిసారిగా మా కుటుంబం విహార యాత్రగా వెళ్ళడం జరిగింది. నాకు తెలిసిన బీచ్ లలో పరిశుభ్రమైన బీచ్! మనుషులకు దూరంగా ఉన్నవన్నీ వాటి వాటి చక్కని స్వరూపాన్ని చెక్కుచెదరకుండా కాపాడు కుంటాయని  అర్థమైంది. ఈ బీచ్ కు   వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళగలిగే ఓర్పుకావాలి. అందుకే ఇది అంత పరిశుభ్రంగా ఉంటుంది. అలలే రోజూ తీరాన్ని ఉడ్చుకుంటూ శుబ్ర పరుస్తున్నాయేమో అనిపిస్తుంటుంది. పరిశుభ్రతేకాకుండా  ఇక్కడున్న మరోప్రత్యేకత తీరాన్ని ఆనుకొని ఎతైన శిఖరానికి ఎక్క గలిగే కొండ ఉంటుంది. ఆ కొండని నిత్యం ముద్దాడే అలలు మనలను కేరింతలు కొట్టిస్తాయి. ఎతైన ఇసుక తిన్నెలతో,సందడి చేసే పీతలతో మనోహరంగా ఉంటుంది తంతడి. మేము వెళ్లి నందుకు  సముద్రమ్మ ఒక చేపను మాకు బహుమానంగా ఇచ్చింది.




































No comments:

Post a Comment